Take a fresh look at your lifestyle.

అంగన్వాడీ లో గర్భిణీలకు శ్రీమంతం

మెట్ పల్లి, ముద్ర: పట్టణంలోని 12వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహ్మద్ షాఖీర్ సిద్ధికి పాల్గొని గర్భిణీలకు ఫలహారాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీల ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ప్రతిభ, టీచర్ గంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.