Take a fresh look at your lifestyle.

చిట్యాలలో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో

 

ముద్ర, చిట్యాల :

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళే ఆశా వర్కర్ల పై సర్కారు నిర్బంధాన్ని నిరసిస్తూ చిట్యాల లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి బయ్యన్న, జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ లు  మాట్లాడుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి ముందుగా అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తర్వాత ఆశా వర్కర్ల ఇండ్ల వద్దకు వెళ్ళి ముందస్తు అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. అరకొర వేతనాలతో పని చేస్తున్న ఆశా వర్కర్ల మీద అదనపు పనులు చెబుతూ వారిచే వెట్టిచాకిరి చేపిస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని అన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అందించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నార్కట్ పల్లి మండల కన్వీనర్ బొబ్బల అరుణ జ్యోతి, ఆశా వర్కర్ల సంఘం చిట్యాల, నార్కట్ పల్లి మండల నాయకులు లక్ష్మి,నీరజ,పద్మ, వాణి, గుత్తా సరిత, వేముల అరుణ, నీలమ్మ, రేణుక,శైలజ, జయమ్మ,శోభ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.