సిద్దిపేట:ముద్ర ప్రతినిధి :
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పగడ్బందిగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు – 2026 నిర్వహణ గురించి చీఫ్ సూపరిడెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 14 వ తేదీ నుండి ఏప్రిల్ 16 వ తేదీ వరకు 82 సెంటర్ లో పదవ తరగతి పరీక్షల నిర్వహిస్తున్నట్లు జిల్లాలో మొత్తం 15358 విద్యార్థులు అందులో బాలురు 7700, బాలికలు 7637, తో పాటు ప్రవేట్ విద్యార్థులు 21 పరీక్ష రాయనున్నారు. నిర్వహణ కోసం చీఫ్ సూపరిడెంట్ 82, డిపార్ట్మెంట్ ఆఫీసర్ లు 82, కస్టోడియన్స్ ఆఫీసర్ లు 9 నియమించినట్లు తెలిపారు.
82 కేంద్రాల్లో వాష్ రూమ్స్ క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, సెంటర్ లో ఏఎన్ఎం మెడికల్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీఫ్ సూపరిడెంట్లు మీరు విధులు నిర్వహించే సెంటర్ లో అన్ని వసతులు ఉన్నాయని చెక్ చేసుకోవాలని సీసీ కెమెరాలు తప్పనిసరి, అన్ని గదుల్లో వెలుతురు వచ్చేలా ట్యూబ్ లైట్లు ఆమర్చుకోవాలని, పర్నిచర్ కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో నుండి సెంటర్ వచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పించి పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్ కి చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
ఏ సెంటర్ లో సైతం మాల్ ప్రాక్టీస్ జరగకుండా పగడ్బందిగా ఏర్పాట్లు చెయ్యాలని తెలిపారు. సెంటర్ పరీక్ష నిర్వహించే పూర్తి బాధ్యత చీఫ్ సూపరిడెంట్ మాత్రమే అని పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్ కు శిక్షణ అందించాలని తెలిపారు.
జిల్లాలో పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుండి సెంటర్ లకు, పరీక్ష పూర్తయ్యాక పేపర్ లను పోలీస్ అధికారుల సమక్షం లో ఎస్కార్ట్ సహాయంతో తీసుకెళ్లాలని తెలిపారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు – 2026 బోర్డ్ ప్రతి రూమ్ లో పరీక్ష రాసే విద్యార్థలు కు సమయం తెలపాలని సెంటర్ కి పరీక్ష సమయానికి కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు మినహాయింపు కల్పించినట్లు తెలిపారు.
అందరూ అధికారులు సమన్వయంతో పనిచేసి విధులు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణం లో విజయ వంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి పరీక్ష కి నిర్వహణ 3, 4 రోజుల గ్యాబ్ ఉన్నందున చదువుకోడానికి స్కూల్ కి వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ప్రక్రియ సైతం వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. పిఎం- శ్రీ లో ఎంపిక చేసిన పాఠశాలలో మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి తదితరులు ఉన్నారు.