Take a fresh look at your lifestyle.

ఎఐ సమ్మిట్ ను కాంగ్రెస్ అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్ రెడ్డి

-అంతర్జాతీయ ఎఐ సమిట్ వద్ద దేశ ప్రతిష్ట దిగజార్చిన కాంగ్రెస్
-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్ రెడ్డి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:

ఇటీవల దేశ రాజధానిలో జరిగిన ఎఐ సమ్మిట్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని, అంతర్జాతీయ ఎఐ సమిట్ వద్ద దేశ ప్రతిష్టను యూత్ కాంగ్రెస్ నాయకులు దిగజార్చారని   బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్ రెడ్డి ఆరోపించారు. ఎఐ టెక్నాలజీ ప్రాధ్యానతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎఐ టెక్నాలజీలో విప్లవాత్మకంగా అభివృద్ధి చేయడానికి అధిక నిధులు కేటాయించిందన్నారు. ఢీల్లీలో జరిగిన ఎఐ సమ్మిట్ కు 100 దేశాలకు పైగా ప్రతినిధులు, ప్రధాన మంత్రులు, ఎఐ రంగానికి చెందిన నిపుణులు హాజరు అయ్యారని తెలిపారు. భారత దేశం రూపొందించిన ఎఐ విజయాలను ఈ సమ్మిట్ లో ప్రదర్శించారని చెప్పారు. ఎఐ టెక్నాలజీ ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా అన్ని భాషలలో అనువాదమైందని తెలిపారు. 2047 వరకు భారత దేశం అగ్ర రాజ్యంగా ఎదగడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎఐ టెక్నాలజీ, ఐటి రంగం, ఎయిర్ అండ్ స్పెస్ టెక్నాలజీ, మెడిసన్ టెక్నాలజీలను కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ రంగాలలో భారత దేశాన్ని అగ్ర రాజ్యం చేయడానికి  ఇలాంటి సమ్మిట్లను నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలుసని చెప్పారు. భారత దేశంతో ఇతర దేశాలు సఖ్యతగా ఉండాలన్న ఆలోచన కు వచ్చిన సమయంలో భారత మండపంలో జరిగిన ఎఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన అర్థ నగ్న ప్రదర్శన అంతర్జాతీయ స్థాయి లో కించపరిచే విధంగా ఉందన్నారు. భారత దేశాన్ని టెక్నాలజీ రంగంలోనే కాకుండా అట్టడుగు స్థాయి వ్యక్తుల మౌళిక వసతులైన ప్రతి పేద వానికి ఇల్లు, మరుగు దొడ్డి, ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీరు, ప్రతి పేద వాడికి ఆరోగ్య భీమా కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 70 ఏండ్లు దాటినా ప్రతి వ్యక్తి కి ఉచిత వైద్యం, అసంఘటిత కార్మికుల పెన్షన్, ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా తద్వారా అందరికి ఇన్సూరెన్స్ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రతి గ్రామంలో వీధి దీపాలు, రోడ్లు, పల్లె ప్రకృతి వానలు తదితర అభివృద్ధి పనులను మోడీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందన్నారు. విబిజీ రామ్ జీ పథకం ద్వారా గ్రామీణ మౌళిక వసతుల కల్పనకు గ్రామ పంచాయతీ కే అధికారం ఇచ్చినట్లు తెలిపారు. దేశ అభివృద్ధి తోపాటు సామాన్య ప్రజలకు మేలు జరిగేలా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.