Take a fresh look at your lifestyle.

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ఈఆర్సీ సలహా సభ్యుడు శశిధర్ రెడ్డి మద్దతు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీజీ ఈఆర్సీ సలహా సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్టిజెన్స్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరు రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.
ఆర్టిజెన్స్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శశిధర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు ఏపీ ఎస్ఈబి రూల్స్‌ను యధాతదంగా అమలు చేయాలని కోరారు.
ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి, ఆర్టిజెన్స్ సమస్యలను పరిష్కరించాలని పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, ఆర్టిజన్ కార్మికులు నాగరాజు, శరత్, పృద్వి, ప్రతాపరెడ్డి, చారి, శ్రీశైలం, ప్రణీత, స్వప్న, నాగమణి, మానస, సుమలత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.