Take a fresh look at your lifestyle.

జనగణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేపట్టాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణన మొదటి విడతలో చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ తహసిల్దార్లను ఆదేశించారు.


బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణన ఏర్పాట్లను పరిశీలించారు. జన గణన మొదటి దశలో బాగంగా చేపట్టే ఇండ్ల గణన ప్రక్రియ వచ్చే నెల మే 11 నుంచి జూన్9 వరకు నిర్వహించే ఇండ్ల గణనకు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇండ్ల గణన జాబితా బ్లాక్ లను తయారు చేయడానికి మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని గరిష్టంగా 300ఇండ్లు లేదా 800 జనాబా ఉండేటట్లు ఇండ్ల గణన బ్లాక్ లను సీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా తయారు చేయాలన్నారు.
ఎలాంటి తప్పిదాలు లేకుండా పటిష్టంగా జనగణన బ్లాకుల రూపకల్పన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోర్టల్ నిర్వహణ చేసే ప్రక్రియ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చేసేందుకు
తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్, ఎంపీడీవోలు అధికారులున్నారు.

Leave A Reply

Your email address will not be published.