Take a fresh look at your lifestyle.

హనుమాన్ జయంతి వేడుకకు పేటకు చీకోటి ప్రవీణ్ రాక

 

ముద్ర, నారాయణపేట: 

నారాయణపేట జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా సాయంత్రం బారంబావి నుంచి నిర్వహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా చికోటి ప్రవీణ్, మదన్ గుప్తా హాజరవుతున్నట్లు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకులు కన్న శివకుమార్, ప్రవీణ్, శ్రవణ్, ప్రకాష్ భట్టాడ్, సందీప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గురువారం సాయంత్రం నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్రకు జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల నుంచి, బస్తీల నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. శోభాయాత్ర అనంతరం గొడుగు గేరీ హనుమాన్ మందిరం వద్ద సభ ఉంటుందన్నారు. కాషాయ ధ్వజాలతో ర్యాలీకి రావాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.