సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ…పట్టణ, గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయం చాలా ముఖ్యమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్కర కార్యక్రమం అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే భావం కలిగి ఉండాలన్నారు. 99 రోజుల్లో అనేక కార్యక్రమాల చేపడుతునట్లు చెప్పారు. సుబిక్షమైన పట్టణ, పల్లెల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు.
ప్రజలకు పథకాలు తెలియజేయాలి :ఎమ్మెల్యే రోహిత్

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, పథకాల గురించి ప్రజలకు తెలపాలని ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అబివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం నిరతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, జీరో విద్యుత్, సన్నబియ్యం, మెడికల్ కాలేజీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం లాంటి అనేక పథకాలు చేపట్టామన్నారు. అధికారులు,, ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తీర్చి, పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతను కాపాడాలని, రోడ్డు ప్రమాదాల వల్ల రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి, డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
నోడల్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రజా ప్రతినిధుల పదవి చిన్నదైన బాధ్యత పెద్దదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా అవసరాలను తీర్చాలన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారం చూపించాలన్నారు. ఈ అవగాహనలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, డిఎఫ్ఓ జోజి, ఆర్డీఒ రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారులు హేమ భార్గవి, విజయలక్ష్మి, నీలిమలు 10 అంశాలపై అవగాహనా కల్పించారు. మెదక్,, రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లు రాధిక లావణ్య, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నివేదిత నృత్యం అలరించింది.