ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 42వ వార్డులో రూ.48 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను పరిశీలించి, నాణ్యతతో పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే రూ.62 కోట్ల తో జగిత్యాల లో అభివ్రుద్ది పనులు ప్రారంభం కానున్నాయని, పార్కు సంధి దుకాణ దారులు చెత్తను ఇష్టారీతిన పడేయవద్దని, మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. నూతన బిటి రోడ్డు పక్కన వర్షం నీరు పోయే విదంగా ధోనీ మాదిరిగా ఏర్పాటు చేయాలి.అప్పుడే బీటీ రోడ్డు చెడిపోకుండా ఉంటుందన్నారు. జగిత్యాల పట్టణంలో ట్రేడ్ అనుమతులు ఇచ్చి రెవెన్యూ పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
పట్టణంలో నాణ్యతతో పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్ నాగరాజు, బొలుసాని శ్రీనివాస్, de ఆనంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు సమీండ్ల శ్రీనివాస్, దాసరి ప్రవీణ్, పోతునుక మహేష్, రాజు, కప్పల శ్రీకాంత్, ఈశ్వర్, ae అనిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు .
రాయికల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
రాయికల్ పట్టణంలో అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా రూ.15.20 కోట్లతో చేపట్టే మంచి నీటి సరఫరా పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3.14 కోట్లతో రాయికల్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్మన్ తురగా సౌజన్య శ్రీధర్ రెడ్డి, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ మనోహర్ గౌడ్, ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మార్వో నాగార్జున, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, మాజీ వైస్ చైర్మన్ రమాదేవి అచ్యుతరావు, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్, మచ్చ లక్ష్మి (శేఖర్), రాకేష్ నాయక్, లతికఅనిల్, శ్రీధర్, చిన్న ధర్మపురి, మానస భూమేష్, నాగరాజు,నాయకులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు .