నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల కోసం జిల్లా స్థాయి DOST హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న DOST (Degree Online Services Telangana) ద్వారా అడ్మిషన్లు కొనసాగనున్నాయని ఆమె వెల్లడించారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు DOST ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, కళాశాల కోడ్ 3014 ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసి అడ్మిషన్లు పొందాలని సూచించారు. అదేవిధంగా బి.కాం (BFSI) అనే నూతన వృత్తి విద్యా కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు డిగ్రీ చివరి సంవత్సరంలోనే ఇంటర్న్‌షిప్ అవకాశంతో నెలకు సుమారు రూ.15 వేల వరకు పారితోషికం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కళాశాలలో BA (HEP – English/Telugu/Urdu), BA (HPCA – English), B.Com (Computers), B.Com (BFSI) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రవేశాల మొదటి విడత రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు, వెబ్ ఆప్షన్లు ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అన్ని విడతలకు వర్తిస్తుందని, వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఇవ్వాలని, సీటు వచ్చిన వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఆలస్యం అయితే సీటు రద్దు అవుతుందని హెచ్చరించారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమయానికి నమోదు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. వివరాలకు 9963375850, 8341490263, 9494267661, 9985375623 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.