Take a fresh look at your lifestyle.

పకడ్బందిగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి : భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌ ) ప్రక్రియను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు భువనగిరిఆర్డీవో కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో బీఎల్‌వోలకు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్వేకు సంబంధించిన ఫారాలను అవసరమైన కిట్లను అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ఫారాలను అందజేయాలని వారే స్వయంగా అన్ని నిప్పి అవసరమైన పత్రాలను జాత చేసి ఇచ్చే విధంగా వారికి సూచించాలన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, సందేహాలు, కొత్త మార్గదర్శకాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో భువనగిరి తహాసిల్దార్‌ సిహెచ్‌ జగన్‌ప్రసాద్, నాయిబ్‌ తహాసిల్దార్లు, ఆర్‌ఐలు, బీఎల్‌వోలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.