మాదాపూర్, ముద్ర విలేఖరి : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా, బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ నాయకత్వంలో గోపనపల్లి లోని మంజీరా డైమండ్ హైట్స్ లో స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిసరాలను శుభ్రపరిచి, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలల్లో ప్రజలకు చేసింది ఏమి లేక రాజ్యాంగం ముసుగులో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఇంతలా కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారే స్థాయికి చేరి, ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిగోట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. భాజాపా పార్టీకి వెన్నెముకైనా కార్యకర్తలు రాబోయే రోజుల్లో స్థానికంగా ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల కోసం పార్టీ పనిచేస్తుందని అన్నారు.16 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు చూశారని, భవిష్యత్తు అంతా మనదేనని అన్నారు.గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్ది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమం లో గచ్చిబౌలి డివిజన్ నాయకులు వసంత కుమార్ యాదవ్, రంజిత్ పూరి, హనుమంత్ నాయక్,కిషన్ గౌలి, ప్రభాకర్, తిరుపతి, రాజు, గోవింద, మహేష్ , సీనియర్ నాయకురాలు. వరలక్ష్మి ధీరజ్, మంజీర డైమండ్ హైట్స్ వాసులు అతుల్ పీఎల్ రావు, సుమంత్, అర్జున్, వరప్రసాద్, మదన్, క్రాంతి, రఘు, ఉదయలక్ష్మి, శశి, ప్రియ, తులసి, హేమ, శ్రీలక్ష్మి, రజినీ, బీజేపీ నాయకులు,స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.