Take a fresh look at your lifestyle.

డాక్టరేట్ అవార్డు సాధించిన డా.మల్సూర్ తిరుమల

 

ముద్ర నడిగూడెం…

తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన డా.మల్సూర్ తిరుమల, జూలజీ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పి హెచ్ డి పట్టాను సాధించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, జూలజీ విభాగంలో
“కామారెడ్డి జిల్లా కాచపూర్ సరస్సులోని చేపల వివిధ కణజాలాల్లో నీటి నాణ్యత మరియు లోహాల అంచనా” అనే అంశంపై ఆయన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ పరిశోధన జల కాలుష్యం, చేపల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు మానవ ఆహార భద్రతకు ఎంతో ఉపయోగకరంగా ఉండడం విశేషం. ఈ పరిశోధనను ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్, సీనియర్ ప్రొఫెసర్ టాక్సికాలజీ ల్యాబ్, జువాలజీ విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో పూర్తి చేశారు.
డా. మల్సూర్ తిరుమల గారు ప్రస్తుతం
గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆటోమాస్ డిగ్రీ కాలేజ్, కామారెడ్డి
లో జూలజీ మరియు ఫిషరీస్ విభాగంలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు.
ఈ డాక్టరేట్ సాధనలో తనకు జన్మనిచ్చి ప్రోత్సహించిన తల్లి సోమమ్మ, తండ్రి లింగయ్య, ఎల్లప్పుడూ అండగా నిలిచిన భార్య వనజ, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు తనను గర్వపడేలా నిలిచిన విద్యార్థులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
డా. మల్సూర్ తిరుమల, సాధించిన ఈ ఘనతతో గ్రామస్థులు, కళాశాల అధ్యాపకులు, స్నేహితులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.