ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బుధవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎస్పీ డా జానకి షర్మిల భైంసా పట్టణంలో నిర్వహించిన రూట్ మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసరాలు, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.రూట్ మార్చ్ ద్వారా ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ రూట్ మార్చ్ లో భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, శివంగి మహిళా బృందం, పోలీసు సిబ్బంది ఉన్నారు.