రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణంలోని పలు చర్చిలలో గుడ్ ఫ్రైడేను శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తును స్తుతిస్తూ సామూహిక ప్రార్థనలు చేశారు.ప్రభువు మానవాళికి ఇచ్చిన సందేశాన్ని పాస్టర్లు చదివి వినిపించారు. ఏసుక్రీస్తు త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు.
