- అక్రమంగా నిర్మించిన చిత్రపురి సెక్రటరీ సత్యనారాయణ దొర ఇల్లు కూల్చివేసిన అధికారులు.
గండిపేట్ ముద్ర విలేకరి : మణికొండ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ అన్నారు.మంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురికాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా సంతోష్ సింగ్ మాట్లాడుతూ..హెచ్ఎండీఏ అనుమతి లేకుండా చిత్రపురిలో అక్రమంగా రోడ్డు మీద, బఫర్ ప్రాంతాల్లో ఆరు రో హౌస్ లు నిర్మించగా, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రిట్- 4851/21 ఆదేశాల మేరకు గతంలో నాలుగు రో హౌస్ లను కూల్చారు. మరో రెండు రో హౌస్ లను హైడ్రా ఆదేశాల మేరకు మణికొండ మున్సిపాలిటీ కూల్చారు. కైరోస్ స్కూల్ యాజమాన్యం ఆక్రమించిన 120 అడుగుల రోడ్డును కూడా కాపాడాలని మణికొండ వాసులు కోరుతున్నారు.