- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కుల మత బేధం లేకుండా అందరూ కలిసి ఉండాలి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణములో టి ఆర్ నగర్ ఉర్దూ మీడియం పాఠశాలలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొని,ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదరికం పై కోట్లాడాలని, స్వార్థం కోసం కుల మత వర్గ భేదాలు సృష్టించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.టి ఆర్ నగర్ లో దాదాపు 300 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూం ఇండ్ల ను మంజూరు చేశామన్నారు.నూకపల్లి డబల్ బెడ్ రూం, ఇందిరమ్మ కాలనిని జగిత్యాల పట్టణం లో కలుపుతాం..గెజిట్ మాత్రమే రావల్సి ఉందన్నారు.టి ఆర్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్,ఎస్ఐ సదాకర్, మాజీ కౌన్సిలర్ చాంద్ పాషా, సదర్ లు కుదురథ్ ,సాబిర్, హమీద్, నాయకులు రవి ,ఆమీన్ షబ్బీర్, సుధాకర్,శరత్ రావు, కుడుకల లక్ష్మణ్,సంకే మహేష్, ఇమ్రాన్ మొలి, రహీం,మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
