ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మెట్ పల్లి తహసీల్దార్, గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎన్ నీతాను జగిత్యాల జిల్లా టిజిఆర్ ఎస్ ఎ సంఘం నాయాకులు మర్యాద పూర్వకంగా కలిసి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిఆర్ ఎస్ ఎ సంఘం జిల్లా అధ్యక్షుడు గాలిపెల్లి ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శి చిట్యాల భూమయ్య, అసోషియేట్ అధ్యక్షులు కట్ట విష్ణు, ఉపాఢ్యక్షుడు బి. సురేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజేందర్ రావు, కోశాధికారి నరేందర్, ప్రచార కార్యదర్శి పంగ రాజేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేంద్రప్రసాద్, సీనియర్ సహాయకులు లక్ష్మీ ప్రసన్న, గీర్దావర్ కట్ట ఉమేష్ తదితరులు ఫాల్గొన్నారు.