Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్త ఆందోళనలను సింగరేణిలో జయప్రదం చేయండి బిఎంఎస్ అధ్యక్షులు సత్తయ్య

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ఏరియా1జీడీకే 2 వ గని ద్వారా సమావేశం శుక్రవారం బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి పాల్గొని మాట్లాడుతూ జులై 24 నుండి సెప్టెంబర్ 17 వరకు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను సింగరేణి కార్మికులు భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు, పరిశ్రమ పరిరక్షణ కార్మిక హక్కుల సంరక్షణ అనే లక్ష్యంతో ఆందోళన కార్యక్రమాలు ముందుకు తీసుకు పోవాల్సిన లక్ష్యం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ యూనియన్ కార్మికులందరిని ద్వారా సమావేశాల ద్వారా చైతన్య పరుస్తూ ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని తద్వారా యాజమాన్యం ప్రభుత్వాలు పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
నూతన బొగ్గు గనుల ప్రారంభం తద్వారా కొత్త ఉద్యోగుల నియామకం చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బొగ్గు ఉత్పత్తిలో కంపెనీలు 50 శాతం శాశ్వత ఉద్యోగులతో ఉద్యోగుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని కోరారు.బొగ్గు పరిశ్రమలలో రక్షణ చర్యలు భద్రత నియమాలను ఉల్లంఘించడం వెంటనే ఆపాలి భద్రత నియమాలను 100% పాటించాలి విచక్షణ రహిత ఉత్పత్తి లక్ష్యాలు, అనురక్షిత మైనింగ్ వల్ల కలిగే కాలుష్యాన్ని వీలైనంత త్వరగా అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కోల్ మైండ్స్ ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థను క్రమబద్ధీకరించాలి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరించాలి,ఈపీఎఫ్ తరహా లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.15000 వేల పెన్షన్ పథకంలో 1.16% సహకారాన్ని జమ చేయాలి,పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.1000 కనీస పెన్షన్ 100% అందేలా చూడాలని ఒప్పందం జరిగిన తేదీ నుండి వీలైనంత త్వరగా బకాయిలను చెల్లించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావలసిన బొగ్గు విద్యుత్తు బకాయిలు రూ 39600 సింగరేణి సంస్థకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పొన్నమనేని వేణుగోపాలరావు ఉప ప్రధాన కార్యదర్శి,ఆకుల హరిణ్ సెంట్రల్ ట్రెజరర్, కర్రావుల మహేష్ ఏరియా ఉపాధ్యక్షులు, సాయవేణి సతీష్ ఏరియా కార్యదర్శి,పెంచాల వెంకటస్వామి, ఎల్లావుల కోటయ్య పోతరబోయిన విజయ్ కుమార్, సంగాని సాంబయ్య, ఆకులకోటేష్, పింగిలి అజయ్ కుమార్, చెన్న సతీష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.