Take a fresh look at your lifestyle.

మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం

 
ముద్ర, తాండూర్:
మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీ ఆర్ ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు పేర్కొన్నారు.

“ఇందిరమ్మ రాజ్యం” అని చెప్పుకుంటూ, రేవంత్ రాష్ట్రాన్ని పూర్తిగా “గూండాల రాజ్యం”గా అప్పుల రాష్ట్రంగా సీఎం రేవంత్ రెడ్డి మార్చారని ఆయన తెలిపారు.

ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయం పైనే దాడులు జరుగుతుంటే సామాన్య మానవుల పరిస్థితి ఏంటి ఇంతకీ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రైవేట్ సైన్యల వ్యవహరించడం దుర్మార్గపు చర్య అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు టిఆర్ఎస్ నాయకులు ఎవరు భయపడరని,
గ్రామ సభల్లో ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని పేర్కొన్నారు.

ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటాం. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.