ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
పాలమూరు జిల్లా కు తీవ్ర అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును శనిశ్వరునితో పోల్చారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.శుక్రవారం
కొడంగల్ నియోజకవర్గం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీమంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడారు.కొడంగల్ కు విహారయాత్రకు వచ్చిన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోయారని,అబద్ధాల పునాదులపై పుట్టిన ఆయన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నరన్నారు.పదేళ్లు అధికారంలో ఉండి చేసిన మోసాలు, దోపిడీలు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.మీలాగా మేము మోసం చేసే వ్యక్తులం కాదనీ, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ,రూ.500 కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన మాట మేరకు రూ.22 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.బీ ఆర్ ఎస్ ఇచ్చిన హామీ లు ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్ రూమ్ ల పేరిట ప్రజలను మోసం చేయలేదన్నారు.కొడంగల్ వరకు కాదు.. దేవరకద్ర నియోజకవర్గానికి రండి రుణమాఫీ అయిన రైతులను,ఆరు గ్యారంటీలు అందుకుంటున్న లబ్ధిదారులను చూపిస్తామని,అబద్దాలతో ఇంకెన్ని రోజులు పబ్బం గడుపుతారనీ హరీష్ రావుపై మండిపడ్డారు.ఇందిరమ్మ ఇండ్ల గురించి అబద్ధాలు మాట్లాడుతున్నావని, ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుందన్నారు.రైతు భరోసా విషయంలో అబద్ధాలు మాట్లాడుతున్నావని, కండ్లు ఏమైనా దొబ్బినవా.. గత సీజన్ లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో మద్దతు ధర ఇచ్చి, 45 రోజుల్లో బోనస్ డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేశామన్నారు.అసెంబ్లీలో ఉతికి ఆరేశామంటూ అవాకులు, చవాకులు పేలుచుతున్నవని, అసలు నువ్వు అసెంబ్లీలో ఎక్కడున్నావని, అసెంబ్లీలో నువ్వు అరవడం, పేపర్లు చించడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదన్నారు.అసెంబ్లీలో నీ ప్రవర్తన చూసి నీ తోటి సభ్యులే అసహ్యించుకుంటున్నారని, నీకు నువ్వు గొప్పగా ఊహించుకుంటూ మేధావిలా ఫీల్ అవుతున్నావన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటూ గూగుల్ ను ప్రశ్నిస్తే బిఆర్ఎస్ పార్టీ నాయకులని వస్తుందన్నారు.నీ అవినీతి తెలిసి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మామ సైతం నిన్ను పక్కన పెట్టిండన్నారు.కళ్యాణ లక్ష్మి చెక్కుల్లో సైతం అవినీతికి పాల్పడ్డారని కాగ్ మిమ్మల్ని ఉతికి ఆరేసిందని హరీష్ రావును దుయ్యబట్టారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు అడ్డుకున్నారని, నిలదీశారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నావని, గ్రామసభల్లో పాల్గొంటే ప్రజల స్పందన నీకు తెలిసేదన్నారు. పాలమూరు ప్రజల పాలిట నిజమైన శనీశ్వరుడు నువ్వే హరీష్ రావు, జూన్, 11, 2015 నీ మామ పాలమూరు రంగారెడ్డి ని పూర్తి చేస్తానని చెప్పి మూడు సంవత్సరాలల్లో పూర్తి చేయలేదని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కూడా పూర్తి చేయలేదు కానీ 2016లో ప్రారంభించిన కాలేశ్వరాన్ని పూర్తి చేశారన్నారు. మామ అల్లుళ్ళకు కాలేశ్వరం పూర్తి చేయడానికి చేతులు వచ్చాయి కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడానికి చేతులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలని ఒక్క నాడైనా మీ మామ మీద ఒత్తిడి తెచ్చావా, ఇరిగేషన్ మంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ ఎందుకు సమర్పించలేదనన్నారు.2016 లో ప్రారంభించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి 2017 లో డిపిఆర్ సమర్పించిన మీరు, అధికారంలో ఉన్న చివరి రోజు నాటికి కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ఎందుకు సమర్పించలేదన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పేరు మీద దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి దోచుకున్న నల్ల మట్టిలో మీకు కూడా వాటా ఉందని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు.నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మా నియోజకవర్గంలో కోయిల్ సాగర్ పూర్తిచేసి 50 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పి, 50 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.
పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదని,పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కు జూరాలను నుంచి వరద నీటిని వాడుకుంటే.. రోజూ 3 టీఎంసీల చొప్పున 30 రోజుల పాటు 90 టీఎంసీల వరకు నీటిని తరలించే అవకాశం ఉండేదన్నారు.గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే వెసులుబాటు ఉండేదని, రూ.28 వేల కోట్ల ఖర్చుతో మొత్తం ప్రాజెక్ట్ పూర్తయ్యేదని,దీని ద్వారా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం దక్కేదనని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.
ఒక్క పాలమూరు-రంగారెడ్డినే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.
ఈ సమావేశం లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ , మహబూబ్ నగర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఫయాజ్ , యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఆవేజ్ అహ్మద్ , INTUC జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్ , మీడియా సెల్ కన్వీనర్ బెనహర్ , పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.