- కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.
- బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్, రాగిల్ల సత్యనారాయణ.
ముద్ర,జగిత్యాల : మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ విమర్శించారు. బ్రిటిష్ వాళ్ళకే భయపడలేదని బీజేపీకి భయపడం అన్న దయాకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని బ్రిటిష్ వాళ్ళు వేసిన భీజమే కాంగ్రెస్.. కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు ఏ.ఓ హ్యూమ్ ఒక బ్రిటిష్ అధికారి అన్న విషయం దయాకర్ కు తెలియక పోవడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో బీజేపీని ఓడిస్తాం అనగానే సోనియా, రాహుల్ పై ఈడీ దాడులు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసుఫై ఈడీ విచారణ జరుపుతోందని, ఈడీ అనేది రాజ్యాంగ బద్ధమైన ఒక సంస్థ అని అలాంటప్పుడు మోడీకి అమిత్ షాకి ఏమి సంభందం అని ప్రశ్నించారు.అంబెడ్కర్ గురించి పదే పదే మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఈడీని అవమానిస్తే రాజ్యాంగాన్ని అంబెడ్కర్ ని అవమానించినట్లేనని పేర్కొన్నారు.ఒకవేళ ఈకేసులో సోనియా, రాహుల్ ల తప్పు లేకుంటే కోర్టులో తమ సచ్చీలతను నిరూపించుకోవాలి కానీ ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు తెలపడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు.దేశమంతా కులగణన చేపట్టాలని పార్లమెంట్ లో రాహుల్ డిమాండ్ చేయడం వల్లనే బిజెపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు అసలు సోనియా, రాహుల్ ఏ కులానికి చెందినవారో గాంధీ కుటుంబానికి సోనియా కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎక్కువ కాలం పాలించి స్కాంగ్రెస్ పార్టీగా అవతరించిందని ఏద్దేవా చేశారు.ఈసమావేశంలో బిజెపి జిల్లా కోశాధికారి సుంకేటి దశరథ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు బైరి రాజేందర్, రాగిల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.