Take a fresh look at your lifestyle.

​వాంబే గృహ సముదాయంలో రూ.37.50 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

​ముద్ర కూకట్‌పల్లి :
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వాంబే గృహ సముదాయంలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించనుంది. రూ.37.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే నూతన భూగర్భ డ్రైనేజీ (UGD) పైప్ లైన్ పనులకు గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
​ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ, కాలనీలో నిత్యం డ్రైనేజీ పొంగిపొర్లడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి, ప్రత్యేక చొరవతో ఈ నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు.
​అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని, ప్రతి కాలనీకి స్వచ్ఛమైన మంచినీరు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
​”ప్రజలు ఏ చిన్న సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావచ్చు. నియోజకవర్గాన్ని సమస్య రహితంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తాను.”
ఆరెకపూడి గాంధీ, PAC చైర్మన్ ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం హరీష్, డీజీఎం శ్రీనివాస రాజు, మేనేజర్ ఝాన్సీ, స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.