- తెలంగాణలో బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతర కృషి.
- రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలో బాలల పరిరక్షణ కోసం భౌతికంగా, మానసికంగా, సామాజికంగా భావోద్వేగంగా రక్షించడం కోసం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సతీమణి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బండి అపర్ణతో పలు విషయాలపై చర్చించారు.ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి, సభ్యురాలు బండి అపర్ణ మాట్లాడుతూ 2005 సంవత్సరంలో బాల కార్మికుల నిషేధం నియంత్రణ చట్టం 1986 లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 బాల్య వివాహల నిషేధ చట్టం 2006 ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.పిల్లలకు ఆరోగ్యంగా సురక్షితమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు విద్యా జ్ఞానం అందించడం బాలల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.పిల్లల శ్రేయస్సు సమాజం యొక్క శ్రేయస్సనీ, ముఖ్యంగా బాలలను రక్షించడంతో బాటు గౌరవించాలని, వాటిని కాపాడే అధికారాలు కమిషన్ కు ఉంటాయని అని తెలిపారు. అంతేకాక వనపర్తి జిల్లాల్లో బాలలకు అందుతున్న విద్య గురించి సీతా దయాకర్ రెడ్డి తోటి సభ్యురాలు బండి అపర్ణతో అడిగితెలుసు కున్నారు.అంతేకాక ఫోక్సో చట్టం అమలు తీరు, బాధితులకు అందుతున్న పరిహారం వంటి విషయాలను ఆమె సభ్యురాలు అపర్ణతో ఏకాంతంగా రెండు గంటల పాటు జరిగిన ముఖాముఖి చర్చలో చర్చించుకున్నారు.బాలల పరిరక్షణ తెలంగాణ ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎక్కడ కూడా బాలలు వెట్టిచాకిరికి గురికాకుండా బాల్య వివాహాలకు, మానసిక రుగ్మతలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బాలల పరిరక్షణ అందరు బాధ్యత అనే సంకల్పంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు బాలల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో బాలల పరిరక్షణ కమిటీ కమిషనర్ సీతా దయాకర్ రెడ్డి తో పాటు రాష్ట్ర సభ్యురాలు బండి అపర్ణ జిల్లా ఎస్పి రావుల గిరిధర్ ఉన్నారు.