- అన్ని యూటీఎస్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రైల్వే టికెట్ కొనుగోలును మరింత సులభతరం చేస్తూ అన్ని యూటీఎస్ కౌంటర్లో క్యూఆర్ కోడ్ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. అన్ని రైల్వే స్టేషనల్లో యూటీఎస్ (జనరల్ బుక్కింగ్), పీఆర్ఎస్ (రిజర్వేషన్లు) కౌంటర్లలో క్యూఆర్ కోడ్ ద్వారా మెరుగైన చెల్లింపు పద్దతిని ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ ప్రవేశపెట్టడం వలన క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన అసరం ఉండదని, ద్రవ్య లావాదేవీలలో కూడా ఖచ్చితత్వం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి యూటీఎస్ కౌంటర్లు అధునాతన పరికరాలతో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 879 క్యూఆర్ పరికరాలను దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని యూటీఎస్ కౌంటర్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.