ముద్ర,తెలంగాణ బ్యూరో : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. యూరప్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 100 మందిని మోసం చేసి, రూ. 5 కోట్లు వసూలు చేసిన నిందితులు కొట్టు సాయి రవితేజా, కొట్టు మనోజ్ లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని మొత్తం ఆరుగురు సభ్యులపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలో ఈ ముఠా బ్రాంచ్ లను ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.