Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధిలో భూ నిర్వాసితులు, రైతులకు న్యాయం చేయాలి

ముద్ర, యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పునరుద్ధరణలో భూములిచ్చిన తమకు న్యాయం చేయాలని రైతులు, భూ నిర్వాసితులు శనివారం ఈవో కు వినతి పత్రం ఉందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ భూములను దేవస్థానంకు ఇస్తే మాకు వ్యాపారం చేయుటకు దుకాణాలు, కొండపై దేవస్థానంలో ఉద్యోగాలు అందిస్తారనే ఆశతో ప్రభుత్వ ఆదేశాలను విస్మరించకుండా కోట్ల రూపాయల విలువచేసే భూములను అప్పగించామని మాకు ప్రభుత్వ పరిహారం కింద తీసుకున్న భూమికి మాత్రం డబ్బులు అందజేశారు కాని ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా కుటుంబీకులకు జీవనోపాధి లేకుండా పోయిందని బ్రతుకు తెరువు కోసం సొంత ఊరు విడిచి దూరంగా కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నామన్నారు. భూములు కోల్పోయి వ్యవసాయం లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని మేము ఇచ్చిన భూములలో దేవస్థాన వ్రత మండపాలు, వాహన పూజ, అన్నదాన కాంప్లెక్స్, హెలిపాడ్, గోదాం, వాహనాల పార్కింగ్ వంటివి ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కలుగచేస్తున్నారు కానీ భూ నిర్వాసితులమైన మేము రోడ్డున పడ్డామన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో రోడ్డు ఇరువైపులా ఇండ్లు దుకాణాలు కోల్పోయిన వారికి భూమిపై ఇంటిపై వెలకట్టి ప్రభుత్వ పరిహారంతో (డబ్బులతో) పాటుగా ఉండటానికి నివాస స్థలం, కొండ వెనుక భాగంలో దుకాణాలు ఇచ్చినట్లు, కొండ వెనుక భాగంలో దుకాణాల సముదాయాలను కొండపై దుకాణాలు, ఉద్యోగ ఉపా అవకాశాలు కల్పించాలని విన్న వించుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో
బి.నాగరాజు, నర్సింహా, రాములు, ఆర్.మత్స్యగిరి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.