Take a fresh look at your lifestyle.

గడిచిన రెండేళ్లలో ఏమైనా అభివృద్ధి ఉందా?

విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి

నిరాదరణకు గురైన చిల్డ్రన్స్ హాస్పిటల్ సాక్షిగా బి ఫామ్ లు అందజేత

ముద్ర, నారాయణపేట:

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర నిరాదరణకు గురైన చిల్డ్రన్స్ హాస్పిటల్ సాక్షిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భీ ఫాం లను మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఎస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ హయాంలో జిల్లాను సాధించుకున్నామని… సాధించుకున్న జిల్లాను కాంగ్రెస్ పార్టీ జిల్లాను తీసేస్తామని చెప్పడం బాధాకరమని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ఆసుపత్రి వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ఆసుపత్రిని ఊరి బయటకు తరలించడం ఎంతవరకు సమంజసంమన్నారు. గడిచిన రెండేళ్లలో జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.