ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్-1 కింద స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎస్. గోపాల్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
బ్యాంకు అనుసంధానంతో టూ వీలర్, త్రీ వీలర్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంపు సెట్లు, మైనర్ ఇరిగేషన్, డెయిరీలు, వ్యవసాయ డ్రోన్లు, వ్యవసాయ పరికరాలు, మల్బరీ పట్టు పురుగుల పెంపకం, పందిరి కూరగాయల సాగు, పామాయిల్ మొక్కల పెంపకం తదితర పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ మరియు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు TG OBMMS పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.