ముద్ర ప్రతినిధి, మెదక్:
ఉగాది తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం పురస్కరించుకొని మెదక్ పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ పఠనం చేశారు. పురోహితులు వైద్య శ్రీనివాస్ పంచాంగ చేయగా, ఆలయ అర్చకులు నరేంద్రాచార్య, జితేందర్, ఆలయ కమిటీ బాద్యులు గడ్డం కాశీనాథ్, నాగరాజ్, వెంకటేష్, వార్డ్ కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు. ముందుగా స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ ఏడాది నవనాయకులలో ఏడుగురు శుభ ఫలితాలు ఇచ్చే వారుండటంతో అంతా మంచే జరుగుతుందని ప్రముఖ పురోహితులు వైద్య శ్రీనివాస్ శర్మ పేర్కొన్నారు. రాజుగా గురుడు, సైన్యాధిపతిగా చంద్రుడు, ధాన్యాధిపతిగా బుధుడు ఉన్నారని వివరించారు. ఈ ఏడాది 4 భాగాల వర్షం కురిసే అవకాశం ఉందని, యమునా పుష్కరాలు ఉండగా ఎలాంటి గ్రహణాలు లేవని ఆయన వివరించారు.
అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడంతో పాటు రహదారులు చాలా గొప్పగా నిర్మించబడతాయన్నారు.