Take a fresh look at your lifestyle.

ఏడుపాయల వన దుర్గ ప్రత్యేక అలంకరణ వేలాది మంది భక్తుల దర్శనం

ముద్ర ప్రతినిధి, మెదక్:
తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత అమ్మవారిని ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రతి అలంకరణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెల్లవారుజామున అమావాస్య ఘడియలు కూడా ఉండడంతో భక్తుల పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకున్నారు. మెదక్, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చారు

Leave A Reply

Your email address will not be published.