ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
వ్యవసాయానికి సాంకేతికత తోడైతే అద్భుతాలు చేయొచ్చని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మేటలో ప్రారంభం కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద గురువారం రైతు స్టాల్స్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రైతు ఉత్సవాల్లో భాగంగా 150 స్టాల్ లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. శాస్త్రవేత్తలతో పంటల మార్పిడి పై అవగాహన ,సాంకేతికత ఉపయోగించి వ్యవసాయ పద్ధతులు ,అధిక దిగుబడి ఇచ్చే వంగడాల పై ఇక్కడ వచ్చే మూడు రోజుల పాటు వివిధ స్టాల్ ల ద్వారా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయాన్నారు. వచ్చే మూడు రోజుల పాటు కరీంనగర్ ,సిద్దిపేట , జనగాం ,మెదక్ ,భువనగిరి హనుమకొండ ,వరంగల్ జిల్లాల నుండి రైతులు ఇక్కడికి వచ్చే అవగాహన చేసుకోవాలన్నారు.
నెల 22వ తేదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారని తెలిపారు. ఇక్కడ గంటకు 30 టన్నులను క్రషింగ్ చేసే అధునాతన యంత్రాలున్నాయి. పంటలు పెరిగి అధిక దిగుబడి వస్తే గంటకు 150 టన్నులు క్రషింగ్ జరుగుతుందనానరు. దేశ వ్యాప్తంగా లక్ష కోట్ల విలువైన ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల విదేశీ సుంకాన్ని నష్టపోతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహనిస్తుంది అంతర పంటలు వేసుకోవచ్చన్నారు.ఈ ప్రాంత రైతాంగం అంత ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని దాటి హుస్నాబాద్ రైతులు ఆయిల్ ఫామ్ సాగులో ముందుండాలన్నారు. కోహెడ మండలం లోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందని ఆయిల్ ఫామ్ తో రైతులకు లాభాలు ఉన్నాయన్నారు.
ఉగాది పండుగ రోజు రైతులకు బాగుండాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గుజరాత్ పోయినప్పుడు పాల ఉత్పత్తి పెంచడానికి కురియన్ ఎలాగో తెలంగాణ లో ఆయిల్ ఫామ్ సాగు ఉత్పత్తి పెరగడానికి తుమ్మల నాగేశ్వరరావు అలాగే అని మంత్రి ని కొనియాడారు.
ఆయిల్ ఫామ్ కు రాజకీయాలక సంబంధం లేదు. 2021 లో క్యాబినేట్ లో ఈ ఫ్యాక్టరీ తీస్తే.. దీనిని తుమ్మల నాగేశ్వరరావు ఈ క్యాబినెట్లో నిధులు కేటాయించి పూర్తి చేశారన్నారు. రాజకీయాలకతీతంగా రైతు సంక్షేమానికి కృషి చేస్తాంమని తెలిపారు