Take a fresh look at your lifestyle.

​జేఎన్టీయూలో ఘనంగా ‘స్టాండ్ విత్ హర్’.. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర కూకట్‌పల్లి ​ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి చేరుకోగానే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి పూల మొక్కను అందజేసి సాదరంగా వేదిక వద్దకు ఆహ్వానించారు. మహిళా సాధికారత, భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.
​ఈ పర్యటనలో భాగంగానే కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి, బండి రమేష్ చర్చించుకున్నారు. ముఖ్యంగా రాబోయే సోమవారం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నల్లచెరువు పార్కు ఏర్పాట్లపై ఇరువురు నేతలు చర్చించారు. కూకట్‌పల్లి వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా హైడ్రా ఆధ్వర్యంలో ఈ చెరువును సుందరీకరించిన విషయం తెలిసిందే.
​ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్, సినీ నటుడు సాయి ధరం తేజ్ మరియు ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.