Take a fresh look at your lifestyle.

​ప్రజాసేవ చేసేవారికే జీహెచ్‌ఎంసీ టికెట్లు: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి :

ప్రజాసేవలో ఉంటూ, ప్రజల అభిమానం పొందిన వారికే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. శనివారం వసంత నగర్ డివిజన్‌లోని సర్దార్ పటేల్ నగర్‌లో స్థానిక నాయకులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు.పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
​నాయకుడు సాయిబాబా చౌదరి ఏర్పాటు చేసిన నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ‘హైడ్రా’ ద్వారా వేల కోట్ల విలువైన పార్కులు, చెరువులను కాపాడుతున్నామని తెలిపారు.
కూకట్‌పల్లిలోని నల్లచెరువును సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు.
​మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్, మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో రేవంత్ రెడ్డి తెలంగాణలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారని రమేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.