Take a fresh look at your lifestyle.

ప్లాస్టిక్ రహిత తెలంగాణ రూపుదిద్దుకోవాలి

  • మంత్రి కొండా సురేఖ 

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్లాస్టిక్ ర‌హిత రాష్ట్రంగా  తెలంగాణ రూపుదిద్దుకునేలా  ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని రాష్ట్ర‌ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణాన్ని నష్టపరచొద్దని మంత్రి చెప్పారు.మంగళవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పోస్టరును మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ..”ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. రోజు రోజుకూ పెరుగుతోన్న ప్లాస్టిస్ కాలుష్యం వలన పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కాలుష్యం వలన కలిగే హాని, దుష్ప్రభావల గురించి ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్లాస్టిక్ట్ రీసైక్లింగ్ చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సరైన వ్యర్థాల నిర్వహణ వంటి స్థిరమైన పద్దతులను అవలంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె నొక్కి చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో సమాజం భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీజీ పీసీబీ మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.