Take a fresh look at your lifestyle.

సింగరేణి వార్డు అసిస్టెంట్ లకు గ్రేడ్ ఈ ప్రమోషన్ లు ఇప్పించండి

  • సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పని చేస్తున్న వార్డు అసిస్టెంట్ లకు గ్రేడ్ ఈ ప్రమోషన్ లు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ కు వచ్చిన సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను వార్డు అసిస్టెంట్ లు మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. తమకు కోల్ ఇండియాలో ఇచ్చిన విధంగా గ్రేడ్ ఈ ప్రమోషన్ లు ఇవ్వాలని వార్డు అసిస్టెంట్ లు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్య వైద్యాధికారి తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు అసిస్టెంట్ లు సంతోష్, అనిల్ భాస్కర్,అఫ్సర్ పాషా, విద్యా సాగర్,గోపిక్రిష్ణ, పోచంపల్లి శ్రీనివాస్, కుమారస్వామి, శ్రీకాంత్, అఖిల్,రామలక్ష్మి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.