Take a fresh look at your lifestyle.

11న విద్యాసంస్థలకు సెలవు- కలెక్టర్ ఆదర్శ సురభి

ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీలకు జరగనున్న రెండో సాధారణ ఎన్నికల దృష్ట్యా, పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 నాడు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 తేదీన మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో ఈ స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలు జరగనున్న వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత 5 మున్సిపాలిటీల పరిధిలో ఈ సెలవు వర్తిస్తుందన్నారు. పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలకు (పాఠశాలలు మరియు కళాశాలలు) సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు ఎటువంటి ఆటంకం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.