తాండూర్. ( ముద్ర): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 9 వార్డ్ నెంబర్ 10 సాయిపూర్ లో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్తి రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయిపూర్ ప్రాంతం అంటేనే పట్టోళ్ల ఫ్యామిలీకి కంచు కోటగా భావిస్తారు తాండూర్ నియోజకవర్గ ప్రజలు, ప్రత్యర్థి ఎవరైనా సరే వారిని ఓడించడం అసంభవం. పార్టీల కతీతంగా ఏ సమస్య వచ్చినా నేనున్నానని భరోసా కల్పించే ఫ్యామిలీ వారిది.రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా ఉండేదో ఇక్కడ సిసి రోడ్లు, మురుగు కాలువలు, త్రాగునీటి సదుపాయం చూస్తేనే బి ఆర్ఎస్ పాలన ఎలా ఉంటదో మీకే అర్థమవుతుందని ఆమె తెలిపారు. ప్రచార పర్వంలో 9వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి పట్లోళ్ల దీప, పదవ వార్డ్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నరసింహులు, సీనియర్ నాయకులు శ్యామ్ రెడ్డి, గంగాధర్, యూసుఫ్, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.