Take a fresh look at your lifestyle.

కేటీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలి-బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

 

. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూర్.ముద్ర: బి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం రోజున వికారాబాద్ జిల్లా తాండూర్ లో జరిగే రోడ్ షోకు హాజరవుతున్నారని, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రోజున తన నివాసంలో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు తాండూర్ లోని ఇందిరాచౌక్ వేదికగా కేటీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుందని, ఆయన తెలిపారు. ఈ రోడ్ షో ద్వారా ప్రతిపక్ష పార్టీలకు గట్టి సమాధానం చెప్పాలని అందుకుగాను ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్ షో ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని పార్టీ ఇంచార్జ్ లకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్, బిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నరసింహులు, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ చారి, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.