- కాస్మటిక్ చార్జీలు నేరుగా విద్యార్థుల అకౌంట్ లోకి.
- విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం, వసతి అందించాలి.
- ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద, హెల్త్ ప్రోపైల్ తయారుచేయాలి.
- నాలుగు నెలల అద్దె బాకాయిలు విడుదల.
- బీసీ సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొన్నం.
ముద్ర, తెలంగాణ బ్యూరో: విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం (2025-2026) బుధవారం నుంచి పునఃప్రారంభం కావడంతో సంబంధిత శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాల విద్యను అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో, విద్యాబోధనలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ముఖ్యంగా ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డన్స్ ప్రత్యేక శ్రద్దతో పనిచేయాలన్నారు.ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ విద్యార్థుల భవితవ్యం కోసం శాయశక్తుల కృషి చేయాలన్నారు. రాష్ట్రం, దేశం గర్వపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం నాలుగునెలల అద్దె బకాయిలు విడుదల చేసిందన్నారు.భవనాల యజమానులతో సంప్రదించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.పాఠశాలలో, హాస్టల్ లో పరిశుభ్రత పాటించాలని, దోమల నుంచి రక్షణ కోసం నెట్ ఏర్పాటు చేయాలన్నారు.విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్,వసతి సామాగ్రి వెంటనే అందించాలని మంత్రి సూచించారు.రాష్ట్ర స్థాయి అధికారులు నెలవారీ రిపోర్ట్స్ తెప్పించుకోవాలని, ప్రయత్న లోపాలు లేకుండా విద్యార్థులకు విద్య, వనతులు అందించాలన్నారు.ప్రభుత్వ పరంగా మౌలికసదుపాయాలు కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు విద్యార్థులకు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పాఠశాలలో, హాస్టల్ లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే సంబంధింత ప్రిన్సిపాల్, వార్డెన్ ల దృష్టికి తీసుకువచ్చి క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువచ్చి పరిష్కారానికి చర్యలు తీసకోవాలని ఆయన అన్నారు.సరైన సదుపాయాలు లేని పాఠశాలను గుర్తించి వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. కిచెన్, వాటర్ ట్యాంక్ లు, మరుగుదొడ్డులు, బాత్ రూంలు, పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు, చెత్తచెదారం తొలగించాలి. వసతి సదుపాయాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు వారి కాస్మటిక్ చార్జీలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులందరికీ బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారి నెలవారి ఆరోగ్య పట్టికను సిద్దం చేయాలని సూచించారు. ప్రతినెలా ఎత్తు, బరువు నమోదు చేయాలన్నారు. అకాడమిక్ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనేయయయయ. వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో ప్రణాళిక సిద్దం చేయాలన్నారు.
రాష్ట్రస్థాయిలో పదోతరగతి, ఇంటర్ ఫలితాల్లో బీసీ విద్యాసంస్థలు అత్యుత్తమ ఫలితాలు సాధించి ఫన్ట్ ప్లేస్ లో ఉండాలని మంత్రి పొన్నం సూచించారు.ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్ లో అకడమిక్ ప్రోఫెల్ తయారు చేయాలి. పదోతరగతి విద్యార్థి 8,9 తరగతల్లో వారి సబ్జెక్ వారి మార్కులు పరిగణనలోకి తీసుకుని, ఏ సబ్జెక్ లోనైనా వెనుకబడి ఉంటే ఆ సబ్జెక్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.మంచి ఫలితాలు సాధిచడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతినెలా ఆర్ సి వోలు, డిబిసిడివో లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు.ఈ వీడియో కాన్సరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఎంజెపి సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రటరీ లు తిరుపతి, మద్దిలేటి, ఎంబిసి డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిఇవో అలౌక్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జెడి ఇందిర తదితర ఉన్నతాధికారులు, ఆర్ సి వోలు, ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డన్లు పాల్గొన్నారు.
Next Post