కోరుట్ల, ముద్ర విలేకరి: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లు తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గురువారం రోజు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు హైదరాబాదు లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వారి నివాసాలకు వెళ్లి, వారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.జువ్వాడి నర్సింగరావు వెంట నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
