ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో మానవత సేవా సారధి అవార్డు అందుకున్న ఉపాధ్యాయులు నీలం శేఖర్.. అవార్డు రావడం పట్ల అభినందనలు…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రామన్నపేట మండలంలోని ఎన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు నీలం శేఖర్ ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో మానవతా సేవా సారథి అవార్డు అందుకున్నారు.
హైదరాబాద్ కళావేదిక ప్రాంగణంలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, గంగోత్రి కల్చరల్ ఫౌండేషన్ వారు ఆ సంస్థ వ్యవస్థపాక అధ్యక్షులు ప్రవీణ్ పారిజాత ఉమ్మడి తెలుగు రాష్టాలో ఉపాధ్యాయులలో ముగ్గురిని గుర్తించి వారికి అవార్డు అందించి సన్మానం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ అనేక సామాజిక సంస్థలలో భాగస్వామ్యం అయితూ సామజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకి ప్రేరణ కార్యక్రమాలు, ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకి సహాయ కార్యక్రమాలు, ప్రభుత్వ పేద విద్యార్థులకి అండగా ఉంటూ ఎన్నో సహాయ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారని ఆయన సేవలని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు,సినీ గాయకులు, వివిధ రంగాల నుండి ప్రముఖులు పాల్గొని అనంతరం మన మండల వాసికి ఈ అవార్డు రావడంతో ఎంఇఓ గవ్వ జ్యోతి ,దొడ్డి స్వామి, శేఖర్, సురేందర్ రెడ్డి, బాసరాజు యాదగిరి, మట్టా రెడ్డి, తీగల జాన్ రెడ్డి , కమలాదేవి, భవాని, సీనా రెడ్డి , మణి , సైదులు ,రవి కుమార స్వామి మధు బాబు అభినందనలు తెలిపారు.