- సీడ్ కంపెనీలు మోసం చేస్తున్నాయి.
- ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలు.
- నందినగర్ లో కేటీఆర్ ను కలిసి గోడు వెల్లబోసుకున్న అన్నదాతలు.
- రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్.
- పత్తి రైతుల డిమాండ్స్..
1.ఆర్గనైజర్లతో కాకుండా ప్రభుత్వ వ్యవసాయ శాఖనుంచి సీడ్ కంపెనీలు రైతులకు విత్తనాలను పంపిణీ చేయాలి.
2.రైతులు పండించిన సీడ్ పత్తి విత్తనాలను ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను ధృవీకరించాలి.
3.జిల్లాలోని సీడ్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసిన ప్రతి రైతు సీడ్ పత్తి విత్తనాలను ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లలోనే రీ శాంపిల్ చేపించి పరీక్షలు నిర్వహించి వాస్తవ ఫలితాలను రైతులకు ఇవ్వాలి.
4.సీడ్ కంపెనీలు రైతులకు పంట పెట్టుబడికి ఇచ్చిన మొత్తానికి ఆర్గనైజర్లు వడ్డీని వసూలు చేయరాదు.
5.గత సంవత్సరంలో ఏ రకంగా ఐతే ప్రతి ప్యాకెట్ కు ధర ఇచ్చారో ఈ సంవత్సరం కూడా అదే ధరను చెల్లించాలి.
6.సీడ్ పత్తి సాగు చేసే రైతులకు జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీడ్ కంపెనీలతో ఒప్పందం చేపించి రైతులకు గ్యారెంటీ ఇచ్చి నమ్మకం కల్పించాలి.
7. డిఎన్ఎ ఫింగర్ ప్రింట్ చేపించి మోసం చేసిన అన్ని సీడ్స్ కంపినీలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయా కంపెనీలనను నిషేధించాలి. రైతులకు రావలసిన పంట డబ్బులు ఇప్పించాలి.
8.తెలంగాణలోని జిల్లాలలో సీడ్ ఉత్పత్తి జరిగే మండలాలలో మండల వ్యవసాయ అధికారి దగ్గర సీడ్ ఉత్పత్తి చేసే కంపెనీల,రైతుల వివరాలు ఉండాలని సూచించింది.
