Take a fresh look at your lifestyle.

కూకట్‌పల్లి అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్‌కు బండి రమేష్ వినతి

ముద్ర కూకట్‌పల్లి:

నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ను మర్యాదపూర్వకముగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన కమిషనర్‌కు పలు కీలక విజ్ఞప్తులు చేశారు. బస్తీలు, మధ్యతరగతి నివాస ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలను వెంటనే మెరుగుపరచాలి.
బస్తీల్లోని ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మించి, వాటిని స్థానిక ప్రజలకు, మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలి.గతంలో ప్రారంభమై నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మంజూరైన కొత్త పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.
కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాలి బాలాజీ, లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.