ముద్ర కూకట్‌పల్లి :
హజ్రత్ జితే పీర్ దర్గా గంధ మహోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, కేటీఆర్ నగర్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్‌లో అన్ని మతాల వారు ఐక్యంగా పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ముస్లిం సోదరులకు శాండల్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పోశెట్టిగౌడ్, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, సమ్మద్, ఖాజా, బాబాన్, గౌస్, ఖలీమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.