ముద్ర కాప్రా:
వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ మూతినేని వీరయ్య తెలిపారు కాప్రా మున్సిపల్ కార్యాలయంలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు వికలాంగుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాంతాలలో ఇటువంటి గ్రేవెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు వందమంది వికలాంగులు తమ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు ముఖ్యంగా వికలాంగులు ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్, ఇల్లు పెన్షన్లు, వైద్య సహాయం, ఇతర మౌలిక సదుపాయాల గురించి విన్నతీ పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు,