Take a fresh look at your lifestyle.

కోడంగల్ ప్రజల వలసలను ప్రభుత్వం ఆపాలి

  • ప్రభుత్వం నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
  • నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి.
  • మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి.
  • కోడంగల్ ను డివిజన్ గా ప్రకటించాలి.
  • సిపిఐ నియోజకవర్గ నాయకులు గంటి సురేష్ కుమార్.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గ ప్రజల వలసలను ఆపేందుకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ నియోజకవర్గ నాయకులు గంటి సురేష్ కుమార్ అన్నారు, కోడంగల్ లో బుధ వారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ కోడంగల్ నియోజకవర్గ ప్రజలు బొంబాయి, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి జీవన ఉపాధి కొనసాగిస్తున్నారని ఇక్కడే ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకురావాలన్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వలసల నివారణకు కృషి చేయాలన్నారు. నిరుద్యోగులు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి టెట్, డీఎస్సీ, గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్సై లకు కోచింగ్ తీసుకోవాల్సి వస్తుందని కోడంగల్ ప్రాంతంలోనే ప్రభుత్వం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. నారాయణపేట -కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగాన్నికి నీరు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో యువకులు ఆటలు ఆడాలన్న చాలా ఇబ్బందిగా ఉందని ఈ ప్రాంత యువకుల కోసం క్రీడాకారుల కోసం మినీ స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు, కోడంగల్ ప్రజలకు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు కోడంగల్ నియోజకవర్గ కేంద్రని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.