Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే ఆరోగ్యం కుదుటపడాలని ముస్లిం సోదరుల ప్రార్థన

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ త్వరగా కోలుకోవాలని శుక్రవారం జామామసీదులో ముస్లిం సోదరులు ప్రార్థన చేసి అనంతరం అచ్చంపేట సర్కారీ దవఖానలో పండ్లు డబల్ రొట్టెలను రోగులకు పంచిపెట్టారు.ఎమ్మెల్యే వంశీకృష్ణ గుండె ఆపరేషన్ తర్వాత నియోజకవర్గానికి త్వరగా రావాలని అల్లాను ప్రార్థించినట్లు ముస్లిం సోదరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖదీర్.జనరల్ సెక్రెటరీ కరీం,మన్సూర్ ఖాన్,ఇషాక్,ఖాజా, అమీన్,రామ్ రహీం ఆటో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ ఉపాధ్యక్షులు ఉస్మాన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.