Take a fresh look at your lifestyle.

స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

తెలంగాణ నర్సింగ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు జానకి దేవి, జిల్లా కార్యదర్శి ఎం. ఆనంద్, మన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సురేందర్, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్ సింధుజ, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట సాయిబాబా, జనరల్ ఫిజీషియన్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యనారాయణ, ఆర్‌ఎంఓ రోహిత్ కుమార్, ఆర్‌ఎంఓ రవిశంకర్, డాక్టర్ కొటేశ్వర్, నర్సింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.