Take a fresh look at your lifestyle.

రాజకీయాలక అతీతంగా అభివృద్ధి – ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

 

ముద్ర : కాప్రా

రాజకీయాలకు తావు లేకుండా అన్ని కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
కాప్రా, శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అభివృద్ధి పనులకు ప్రభుత్వము మంజూరు చేసిన 20 లక్షల నిధుల ప్రొసీడింగ్ కాపీలను శనివారం ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి, కాప్రా మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ లు శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి సుభాష్ రెడ్డికి కి అందజేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగునున్నట్లు తెలిపారు, కాలనీ సంక్షేమ సంఘాలు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమను సంప్రదించాలని వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు శంకర్రావు, సుబ్బారావు, సంతోష్, రాజు గౌడ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.